కుటుంబంతో కలిసి చూసే సినిమా
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అలాగే కేర్ అఫ్ కంచరపాలెం చిత్ర యూనిట్, ఆ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా పాల్గొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేసారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... "ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దయచేసి సినిమాను పైరసిలో చూడకండి." అన్నారు.
పాత జ్ఞపకాలు గుర్తుకొస్తాయి...
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..."కొత్త నటినటుల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఆడియన్స్ నుండి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. సినిమాలో ఎక్కడా అశ్లీలత లేదు. కుటుంభ సభ్యులు అందరూ సినిమాను చూసి ఆనందించే విధంగా ఎంటర్ టైన్మెంట్ ఉంది. ఈ సినిమా చూస్తే మీకు మీ పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి" అన్నారు.