Mon Dec 23 2024 15:25:36 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ హౌస్ ఫిక్సింగ్....ముందుగానే విన్నర్ ను..?
బిగ్ బాస్ సీజన్ 5 ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ప్రేక్షకుల ఆలోచనలకు భిన్నంగా ఎలిమినేషన్ లు జరుగుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 5 ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ప్రేక్షకుల ఆలోచనలకు భిన్నంగా ఎలిమినేషన్ లు జరుగుతున్నాయి. ముందుగానే ఫిక్స్ చేసుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షో రన్ చేస్తున్నట్లుంది. ప్రేక్షకులు ఎంత విసుక్కున్నా సరే తాము కాపాడాలనుకున్న వారిని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రేక్షకుల ఓట్లు ఒక హంబక్ అని చెప్పక తప్పదు. రవి, కాజల్ ఎలిమినేషన్ లు చూస్తే అలాగే అనిపిస్తుంది.
ఫేక్ ఎలిమినేషన్ లా ఉంది...
కాజల్ చాలా స్ట్రాంగ్. 99 రోజులుగా బిగ్ బాస్ లో తన కంటూ ఒక ప్రత్యేకత సాధించుకుంది. కానీ షణ్ముఖ్, సిరిలు స్క్రీన్ స్పేస్ కోసం ఆడుతున్న డ్రామాలు, ఏడుపులు, అరుపులు మాత్రం బిగ్ బాస్ కు నచ్చినట్లుంది. వారిద్దరిని చూస్తేనే ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు. ముచ్చులా ఉంటూ ఏమీ ఆడకుండా ఉండే షణ్ముఖ్ ను హౌస్ లో ఉంచి, అన్నింటిలో ముందుండే కాజల్ ను తప్పించడమేంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వారం వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం ఆ జంటను విడదీయలేదు. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందమేమో. ఇప్పుడు ఫైనల్ విన్నర్ సన్నీ అనుకుంటున్నాం కాని, చివరకు బిగ్ బాస్ తాను అనుకున్న వారినే విజేతగా చేస్తారు. ఓటింగ్ అనేది ట్రాష్. నాగార్జున బకరా అవుతున్నాడు.
- Tags
- big boss 5
- telugu
Next Story