Mon Dec 23 2024 11:03:00 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : OG మూవీలోని పవర్ఫుల్ డైలాగ్ లీక్ చేసిన ఇమ్రాన్ హష్మీ..
OG మూవీలోని పవర్ఫుల్ డైలాగ్ ని లీక్ చేసేసిన ఇమ్రాన్ హష్మీ. అంతేకాదు మూవీలో పవన్ పేరుని కూడా..
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా 'OG'. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90's బ్యాక్డ్రాప్లో గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో రూపొందుతుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. నేడు ఇమ్రాన్ పుట్టినరోజు కావడంతో OG మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇమ్రాన్ హష్మీ.. సిగరెట్ కలుస్తూ డాన్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ పై ఇమ్రాన్ రియాక్ట్ అవుతూ.. మూవీలోని తన పవర్ ఫుల్ డైలాగ్ ని లీక్ చేశారు. ఆ డైలాగ్ ఏంటంటే.. "గంభీరా నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ప్రామిస్, ఇద్దరిలో ఒక తలే మిగులుతుంది" అంటూ డైలాగ్ ని రాసుకొచ్చారు. ఇక ఈ డైలాగ్ చూసిన అభిమానులు.. ఇదే పవన్ కళ్యాణ్ తో చెప్పే డైలాగ్ అని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా పవన్ పేరు కూడా 'గంభీరా' అని తెలుస్తుంది.
కాగా ఈ మూవీ షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తి అయ్యింది. ప్రస్తుతం పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఎలక్షన్ హడావుడి పూర్తి అయిన తరువాత ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేసి పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే షూటింగ్ కి కావల్సిన లొకేషన్స్ ని కూడా వెతుకుతున్నారు. ప్రస్తుతం సుజిత్ అండ్ టీం ఈ పనిలోనే ఉన్నారు.
Next Story