Mon Dec 23 2024 02:51:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎఫ్ 3.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ !
లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు అంటూ సాగనుంది ఈ పాట. ఎఫ్ 2 లో.. హీరోల భార్యలు తమను పట్టించుకోవడం లేదన్న
వెంకటేశ్ - వరుణ్ తేజ్ లు కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 3. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఎఫ్ 3 మేకర్స్ మరో అప్ డేట్ ను ప్రకటించారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు.
లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు అంటూ సాగనుంది ఈ పాట. ఎఫ్ 2 లో.. హీరోల భార్యలు తమను పట్టించుకోవడం లేదన్న పోరును చూపించారు. ఎఫ్ 3 లో డబ్బు సంపాదించడం లేదని భర్తలను భార్యలు వేధించడాన్ని దర్శకుడు చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎఫ్ 2 లో జోడీలే ఎఫ్ 3 లోనూ కనువిందు చేయనున్నారు. పూర్తి వినోదాన్ని అందించే.. ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
News Summary - F3 - lab dab lab dab dabbu song releasing on february 7th
Next Story