Mon Dec 23 2024 08:22:35 GMT+0000 (Coordinated Universal Time)
Vijay Deverakonda : ఆమె పెదవులు విజయ్ని డిస్టర్బ్ చేస్తున్నాయట..
ఆమె పెదవులు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరివి ఆ లిప్స్..?
Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన బోల్డ్నెస్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. సినిమాల్లో బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకునే విజయ్.. ఆఫ్ స్క్రీన్ లో ఏం అనిపిస్తే అది బోల్డ్ గా చెప్పేస్తూ ఉంటారు. ఈక్రమంలోనే తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె పెదవులు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరివి ఆ లిప్స్..?
విజయ్ నటించిన కొత్త సినిమా 'ఫ్యామిలీ స్టార్' వచ్చే వారం రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో విజయ్, ఇంటర్వ్యూయర్ అమ్మాయితో కలిసి ఓ గేమ్ ఆడారు. ఈ ఆటలో విజయ్ చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టి, ఇంటర్వ్యూయర్ అమ్మాయి ఒక పదం చెబుతుంది. ఆమె పెదవుల కదలిక బట్టి విజయ్ ఆ పదం ఏంటనేది చెప్పాలి.
ఈక్రమంలోనే ఆ అమ్మాయి ఒక పదం చెప్పింది. కానీ విజయ్ కి అదేంటో అర్ధంకాలేదు. దీంతో పక్కన ఉన్న వ్యక్తితో.. "ఆ పదం ఏంటో మీరు చెప్పండి, ఆమె పెదవులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. పదం మీద ఫోకస్ చేయలేకపోతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ వస్తుంది. ఇక ఈ వీడియో పై నెటిజెన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 5న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. గీతగోవిందం తరువాత విజయ్ మరోసారి దర్శకుడు పరుశురాంతో కలిసి ఈ సినిమా చేస్తున్నారు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ కాంబినేషన్ రీచ్ అవుతుందో లేదు చూడాలి. కాగా ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
Next Story