Mon Dec 23 2024 08:57:06 GMT+0000 (Coordinated Universal Time)
"ఐరనే వంచాలా ఏంటి".. ఈ మీమ్స్ చూస్తే నవ్వడం కన్ఫార్మ్..
విజయ్ దేవరకొండ చెప్పిన "ఐరనే వంచాలా ఏంటి" డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. ఇక దీని మీద వచ్చిన మీమ్స్ చూస్తే..
ట్రెండ్ కి తగ్గట్టు సినిమా కథలు మాత్రమే కాదు ప్రమోషన్స్ కూడా మారుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట "ఐరనే వంచాలా ఏంటి" అనే డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. దీని మీద అనేక మీమ్స్ చేసి నెటిజెన్స్ ని మరింత నవ్విస్తున్నారు మీమర్స్. అసలు ఈ డైలాగ్ విషయం ఏంటి..? ఇది ఏ సినిమాలోనిది..? ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది..?
విజయ్ దేవరకొండ తనకి గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్టుని ఇచ్చిన పరుశురామ్ తో కలిసి మరోసారి పని చేస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఇటీవల ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ గ్లింప్స్‌లో విజయ్ చెప్పిన డైలాగే.. "ఐరనే వంచాలా ఏంటి". రీసెంట్ గా ఒక అభిమాని.. ఈ డైలాగ్ ని ప్రభాస్ మిర్చి మూవీ సీన్ తో ఎడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేశాడు. దానికి చిత్ర నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అవుతూ.. రీ షేర్ చేయడం, దాని మీద ఒక ప్రత్యేక పోస్టు వేయడంతో మరింత వైరల్ అయ్యింది.
అంతేకాదు మూవీ టీం దీనిని ఒక ప్రమోషన్లా వాడేసుకుంటున్నారు. ఇక ఈ డైలాగ్ ని పలువురు మీమర్స్.. ప్రధాని మోడీ నుంచి మొదలుపెట్టి బాలయ్య, నాగార్జున, రజినీకాంత్, మహేష్ బాబు, ప్రభాస్, ఆఖరికి కోతితో కూడా చెప్పిస్తూ మీమ్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటి పై మీరుకూడా ఒక లూకా వేసేయండి. వాటిని చూస్తే మీరుకూడా నవ్వడం కన్ఫార్మ్.
Next Story