Mon Dec 23 2024 05:38:58 GMT+0000 (Coordinated Universal Time)
Vijay Deverakonda : హీరోయిన్ కోసం యూట్యూబర్పై.. కేసు నమోదు చేసిన విజయ్..
తన హీరోయిన్ కోసం ఒక తెలుగు యూట్యూబర్ పై పోలీస్ కేసు నమోదు చేసిన విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని, నేడు ఇండియాలోనే ఒక క్రేజీ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కెరీర్ లో వస్తున్న విజయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ ని పెంచుకుంటూ, వరుస చిత్రాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇక ఇంతటి క్రేజ్ ని తనకి అందించిన అభిమానుల పై ఎప్పుడు ప్రేమ చూపిస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో చేయని విధంగా విజయ్ దేవరకొండ.. తన సినిమాలో వచ్చిన లాభాలని అభిమానులతో పంచుకుంటుంటారు. తన బర్త్ డేకి అభిమానులకు కానుకలు ఇస్తుంటారు. ఇలా విజయ్ తన అభిమానుల పై చూపించే ప్రేమ.. ఇతర హీరోల ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఇంతటి క్రేజ్, ఫేమ్ వచ్చినప్పుడు ట్రోల్స్, విమర్శలు అనేవి కూడా కామన్. వాటిని హీరోలు కూడా పెద్దగా పంటించు కోకుండా ముందుకు సాగుతుంటారు.
కానీ ఆ ట్రోల్స్, విమర్శలు శృతిమిస్తే.. హీరోలు కూడా రియాక్ట్ అవ్వక తప్పదు. తాజాగా ఓ తెలుగు యూట్యూబర్ హద్దులు దాటి విజయ్ పై అసభ్యకరంగా వార్తలను సృష్టించాడు. అనంతపురంకి చెందిన యూట్యూబర్ వెంకట కిరణ్ ‘సినీ పోలీస్’ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాడు. ఈ ఛానల్ లో విజయ్ అసభ్యకర రూమర్స్ క్రియేట్ చేయడమే కాకుండా, విజయ్ తో నటించే హీరోయిన్స్ పై కూడా అసత్య వార్తలు సృష్టించి వారిని అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నాడు.
ఈ విషయానికే విజయ్ దేవరకొండ టీం సీరియస్ అయ్యింది. వెంటనే అతడి గురించి సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. అతడిని అరెస్ట్ చేశారు. అతడి యూట్యూబ్ ఛానల్ని, విజయ్ హీరోయిన్స్ పై క్రియేట్ చేసిన వీడియోలను డెలీట్ చేయించారు. అలాగే భవిషత్తులో మళ్ళీ ఇలాంటి వీడియోలు, రూమర్స్ సృష్టించినా లేక సోషల్ మీడియా వేదికల్లో ఎటువంటి అసభ్యకర కామెంట్స్ చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, కౌన్సిలింగ్ ఇచ్చి యూట్యూబర్ ని విడిచిపెట్టారు.
Next Story