Mon Dec 23 2024 16:06:34 GMT+0000 (Coordinated Universal Time)
రష్మిక కు మోకాలినొప్పి.. చికిత్స చేసిన డాక్టర్ గురువా రెడ్డి ఛమక్కులు
బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడు ఏమో.. అంటూ నవ్వు తెప్పించే విధంగా
టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్ళిపోతోంది రష్మిక. ఇప్పటికే దక్షిణాదిన పలువురు స్టార్స్ తో నటించేసిన రష్మిక.. బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లకు ఓకె చెప్పేసింది. ఇక రష్మిక తాజాగా మోకాలి నొప్పితో బాధపడుతూ ఉంది. ఆమె తన మోకాలి నొప్పి చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ గురువా రెడ్డిని సంప్రదించగా.. ఆయన రష్మికకు చికిత్సను అందించారు. ఈ విషయాన్ని గురువా రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. అది కూడా తెలుగులో ఆమెపై ఛమక్కులు విసిరారు. ఆయన పెట్టిన పోస్టులో ఏముందంటే..
"నువ్వు 'సామి..సామి..' అంటూ
మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే
ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!" అని
మోకాలి నొప్పి అంటూ
నా దెగ్గరకు వచ్చిన 'శ్రీవల్లి'కి
సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను..
పుష్ప సినిమా చుసిన మొదలు,
రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు
ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది!
బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడు ఏమో.." అంటూ నవ్వు తెప్పించే విధంగా పోస్టు పెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా పోస్టు చేశారు గురువా రెడ్డి. నవ్వుతూ రష్మిక మందాన కనిపించింది.
కరోనా సమయంలో తెలుగు వారందరికీ ఆత్మస్థైర్యం నింపిన డాక్టర్ గురువా రెడ్డి. తెలుగు ప్రజలు భయం గుప్పిట ఉన్న సమయంలో కరోనాను ఎలా ఎదుర్కోవాలి.. ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను చెబుతూ గురువా రెడ్డి ప్రశంసలు అందుకున్నారు.
రష్మిక మందాన ప్రస్తుతం పుష్ప-2 లో నటిస్తోంది. ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన గుడ్ బై సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తోంది.
Next Story