Mon Dec 23 2024 07:20:15 GMT+0000 (Coordinated Universal Time)
Kajal Aggarwal: సెల్ఫీ కోసం వచ్చి.. కాజల్‌తో తప్పుగా ప్రవర్తించిన ఫ్యాన్..
సెల్ఫీ కోసం వచ్చి కాజల్‌తో తప్పుగా ప్రవర్తించిన ఫ్యాన్. వైరల్ అవుతున్న వీడియో.
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. సౌత్ లాంగ్వేజ్స్ లోని పలువురు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని ఎంజాయ్ చేశారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్న కాజల్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. తమిళ్, తెలుగు భాషల్లో మళ్ళీ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరోయిన్ హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కి గెస్ట్ గా వచ్చారు. దీంతో అక్కడికి కాజల్ ని చూసేందుకు అనేకమంది ఫ్యాన్స్ వచ్చారు.
ఇక ఆ అభిమానులంతా కాజల్ తో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో కాజల్ కూడా ఫ్యాన్స్ కోసం కొందరికి సెల్ఫీలు ఇచ్చి సంతోష పరిచింది. అయితే ఈక్రమంలోనే ఓ అభిమాని.. కాజల్ తో తప్పుగా ప్రవర్తించాడు. ఫోటో దిగే ప్రయత్నంలో కాజల్ నడుము పై చెయ్యి వేసి మిస్ బిహేవ్ చేసాడు. అభిమాని ఆలా చేసేపాటికి కాజల్ షాక్ కి గురైంది. వెంటనే అతడి పై సీరియస్ అయ్యింది. దీంతో ఆ అభిమానిని బౌన్సర్ లు పక్కకి లాగేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాజల్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్నారు. తమిళంలో శంకర్ అండ్ కమల్ హాసన్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఇండియన్ 2'లో నటిస్తున్నారు. ఇక తెలుగులో 'సత్యభామ' అంటూ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ అండ్ గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసాయి. అలాగే హిందీలో కూడా 'ఉమా' అనే లేడీ ఓరియంటెడ్ మూవీనే చేస్తున్నారు. ఈ చిత్రాలు అన్ని త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.
Next Story