Mon Dec 23 2024 06:34:09 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : ఫ్యాన్స్ని భయపెడుతున్న గుంటూరు కారం, అజ్ఞాతవాసి మధ్య కనెక్షన్స్..
గుంటూరు కారం, అజ్ఞాతవాసి మధ్య కనెక్షన్స్ ఫ్యాన్స్ని తెగ టెన్షన్ పెడుతున్నాయి. ఇంతకీ ఆ టెన్షన్ ఎందుకు..?
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'గుంటూరు కారం'. మహేష్ బాబుని ఇప్పటి వరకు చూపించినంత మాస్ గా ఈ మూవీలో చూపించబోతున్నారంటూ మేకర్స్ చెప్పుకు రావడం, రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో కూడా ఆ రేంజ్ మాస్ కనిపిస్తుండడంతో.. అభిమానుల్లో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అభిమానులకు ఇప్పుడు ఒక భయం పట్టుకుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ టాక్ ని సొంతం చేసుకొని డిజాస్టర్ గా నిలిచింది. ఇంతకీ అసలు గుంటూరు కారం, అజ్ఞాతవాసి మధ్య కనెక్షన్స్ ఏంటి..? అభిమానులు భయపడుతున్న విషయం ఏంటి..?
గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగల్ 'దమ్ మసాలా' సాంగ్ ని త్రివిక్రమ్ పుట్టినరోజు నాడు నవంబర్ 7న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ రిలీజ్ విషయమే ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. పవన్ 'అజ్ఞాతవాసి' మూవీ ఫస్ట్ సింగల్ ని కూడా ఇదే డేట్ కి రిలీజ్ చేశారు. 'బయటకొచ్చి చూస్తే' సాంగ్ ని త్రివిక్రమ్ బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. ఇక అజ్ఞాతవాసి మూవీ కూడా సంక్రాంతి కానుకగానే 2018లో రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు గుంటూరు కారం కూడా సంక్రాంతి కనుకగానే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ రెండు విషయాలే అభిమానులను టెన్షన్ కి గురి చేస్తున్నాయి. అజ్ఞాతవాసి లాగానే గుంటూరు కారం పై కూడా హై రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ అంచులను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద మూవీ ఎక్కడ బోల్తా కొడుతుందో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మరి గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
Next Story