Mon Dec 23 2024 01:51:26 GMT+0000 (Coordinated Universal Time)
"కొమురం భీం" సిద్ధం.. అంచనాలు పెంచేసిన టీజర్
"ఆర్ఆర్ఆర్" సినిమా ట్రైలర్ కోసం పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రియులు, తారక్ - చరణ్ ల అభిమానులు ఎదురుచూస్తున్నారు.
"ఆర్ఆర్ఆర్" సినిమా ట్రైలర్ కోసం పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రియులు, తారక్ - చరణ్ ల అభిమానులు ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ విడుదలకు మరొక్క రోజే ఉండగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ "కొమురం భీం" టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ తో "ఆర్ఆర్ఆర్" ట్రైలర్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రాబోతున్న సమయంలోనే 'ఆర్ఆర్ఆర్' మేకర్స్ ఎదో ఒక అప్డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను పంచుకున్నారు.
కల్పిత కథ అయినా?
"ఆర్ఆర్ఆర్" సినిమా 1920 కి ముందు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయంలో తెరకెక్కుతున్న కల్పిత కథ. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ముందు తెలిపారు. ఎంత కల్పిత కథ అయినా.. జక్కన్న తీసే సినిమాలు చూస్తే.. నిజంగానే ఇది జరిగిందా అన్నట్లుగా ఉంటాయి. డిసెంబర్ 9న ట్రైలర్ విడుదల కానుండగా.. జనవరి 7, 2022 న ఈ సినిమా భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో ఒలివియా మోరిస్, సముద్ర ఖని లతో పాటు శ్రియా శరణ్ కూడా ముఖ్య పాత్రలో నటించారు.
- Tags
- RRR
- new teaser
Next Story