Mon Dec 23 2024 15:00:57 GMT+0000 (Coordinated Universal Time)
చెర్రీకి డిఫరెంట్ గా బర్త్ డే విషెస్ చెప్పిన ఫ్యాన్స్
మెగా అభిమానుల నుంచి చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా బర్త్ డే సమయానికి..
రాజమండ్రి : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా.. పలువురు సినీ ప్రముఖులు సహా.. మెగా అభిమానుల నుంచి చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా బర్త్ డే సమయానికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవ్వడం.. బిగ్గెస్ట్ హిట్ కావడం చరణ్ కెరీర్ లోనే మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ గా ఉండిపోనుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్-భీమ్ ల యాక్షన్ హంట్ ను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. స్నేహితులుగా, అన్నదమ్ములుగా ఉన్న వారిద్దరూ కొట్టుకోవడం ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తోంది. సినిమా రిలీజై మూడ్రోజులైనా.. ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. సినిమాలోని కొన్ని సీన్స్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరచడం ఖాయం.
ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా తూ.గో. జిల్లా రాజమండ్రిలో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. చరణ్ కు డిఫరెంట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేలపై రంగులతో భారీ చిత్రాన్ని రూపొందించి బర్త్ డే విషెస్ తెలిపారు. విఎల్ పురంలోని కారు వాష్ షెడ్డు వెనుక ఖాళీ స్థలంలో కొందరు యువకులు తోటి అభిమానులతో కలిసి భారీ చిత్రాన్ని రూపొందించారు. 20 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు ఉన్న ఆ చిత్రాన్ని నాలుగు రంగులతో రూపొందించినట్లు వారు తెలిపారు.
Next Story