Fri Dec 20 2024 18:05:44 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..? సలార్ కథని..
సలార్ కథని మలుపు తిప్పే పాత్రని చేసిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..?
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు.
ఈక్రమంలోనే ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరిగా రాధారామ పాత్రలో కనిపించిన తమిళ నటి శ్రియారెడ్డి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా ఫర్జానా సయ్యద్ అనే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ సినిమాలో ఈ అమ్మాయి చేసిన పాత్రతో మూవీ స్టోరీ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ సినిమాలో ఫర్జానా సయ్యద్ చేసిన పాత్ర ఏంటని ఆలోచిస్తున్నారా..?
మూవీలో కతేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అందరికి గురుకు ఉండే ఉంటుంది. ఆ సీక్వెన్స్ లో ప్రభాస్ ఒక సురభి అనే అమ్మాయి కోసం ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సినిమాకే హైలైట్ అయ్యింది. ఆ సురభి పాత్ర చేసిన అమ్మాయే ఫర్జానా సయ్యద్. తాజాగా ఈ అమ్మాయి ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. మూవీలో డీ గ్లామరస్ గా కనిపించిన ఫర్జానా.. ఈ ఇంటర్వ్యూలో చాలా అందంగా కనిపించడంతో ఆడియన్స్ ఈ అమ్మాయి ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.
ఆడిషన్ లో తనని సెలెక్ట్ చేసిన తరువాత ఏదో చిన్న పాత్ర అనుకుందట. కానీ సెట్స్ కి వెళ్ళాక ఏకంగా ప్రభాస్ తో సన్నివేశం, అది కూడా ముఖ్యమైన పాత్రలో తనని నటించేలా చేయడం ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఇక తన నటనని ప్రభాస్, ప్రశాంత్ నీల్ ప్రశంసిస్తూ.. థియేటర్ లో నీ సీన్స్ కి విజుల్స్ పడతాయి అని చెప్పారట. వాళ్ళు చెప్పినట్లే థియేటర్ ఈ అమ్మాయి చేసిన సీన్స్ కి విజుల్స్ మోత మోగాయి.
Next Story