Mon Dec 23 2024 07:11:14 GMT+0000 (Coordinated Universal Time)
కలర్ స్వాతి రీ ఎంట్రీ.. ఆకట్టుకుంటున్న పంచతంత్రం ట్రైలర్
ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. బ్రహ్మానందం..
బ్రహ్మానందం, స్వాతి రెడ్డి(కలర్ స్వాతి), సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్, అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తోన్న చిత్రం 'పంచతంత్రం'. ఐదుజంటల చుట్టూ తిరిగే కథ ఆధారంగా, హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు పంచతంత్రం సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆవిష్కరించారు.
ట్రైలర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. బ్రహ్మానందం.. 'పంచేద్రియాలు' అనే పేరు పెట్టి ఆ సీన్ తో కథ మొదలవుతుంది. జీవితమంటే సంతోషమే కాదు. కష్టసుఖాలుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించామన్నదే 'పంచతంత్రం' కథాంశం అని తెలుస్తుంది. ఫీల్ గుడ్, హార్ట్ టచింగ్ మూవీగా డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. పెళ్లి తర్వాత కలర్ స్వాతి ఈ సినిమాతో మళ్లీ తెరపై కనిపించనుంది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నారు.
Next Story