Mon Dec 23 2024 14:20:36 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : టాలీవుడ్లో రిపబ్లిక్ డేకి.. డబ్బింగ్ సినిమాల ఫైట్..
సంక్రాంతి పండగ అయ్యిపోయింది కొత్త సినిమాల సందడి కూడా అయ్యిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే సినిమా పండుగ ఇంకా అవ్వలేదు.
Tollywood : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాల ఫైట్ గట్టిగా జరిగింది. మొత్తం నాలుగు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సంక్రాంతి పండగ అయ్యిపోయింది కొత్త సినిమాల సందడి కూడా అయ్యిపోయింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే సినిమా పండుగ ఇంకా అవ్వలేదు. ఈసారి సంక్రాంతి మాదిరి.. రిపబ్లిక్ డేకి కూడా సినిమాల సందడి కనిపించబోతుంది.
అయితే అవి తెలుగు సినిమాలు కాదు. మొత్తం మూడు డబ్బింగ్ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద రిపబ్లిక్ డేకి పోటీ పడబోతున్నాయి. వీటిలో రెండు తమిళ్ సినిమాలు, ఒకటి హిందీ సినిమా. తమిళ స్టార్స్ ధనుష్, శివ కార్తికేయన్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’, ‘అయలాన్’ సినిమాలు ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలుగులో నాలుగు సినిమాల రిలీజ్ లు ఉండడంతో.. వెనక్కి తగ్గి కేవలం తమిళంలోనే రిలీజ్ చేశారు. అక్కడ రెండు చిత్రాలు మంచి టాక్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు జనవరి 25న రిపబ్లిక్ డే నాడు రిలీజ్ కాబోతున్నాయి.
ఇక బాలీవుడ్ మూవీ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్, దీపికా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫైటర్’. ఆల్రెడీ హృతిక్ తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ రెండు సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఫైటర్ కూడా రిపబ్లిక్ డే నాడే రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో చూడాలి.
Next Story