Sun Dec 22 2024 19:54:11 GMT+0000 (Coordinated Universal Time)
యూట్యూబ్ ఛానల్‌పై హేమ ఫిర్యాదు
సినీనటి హేమ యూట్యూబ్ ఛానల్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినీనటి హేమ యూట్యూబ్ ఛానల్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. సెలబ్రెటీలే లక్ష్యంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని, ఇది సినిమా ఇండ్రస్ట్రీని తరచూ ఇబ్బంది పెడుతుందన్నారు.
సెలబ్రటీలపై...
తాజాగా సినీనటుడు కోట శ్రీనివాసరావు పై కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారా చేశాయి. ఆయన నేరుగా తాను క్షేమంగా ఉన్నట్లు వీడియోను విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సెలబ్రటీలకు చికాకు కలిగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని హేమ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story