Mon Dec 23 2024 23:40:41 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులకు పవిత్ర ఫిర్యాదు.. ఏమన్నారంటే?
సినీనటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు
సినీనటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు నరేష్ పట్ల సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులను పవిత్ర ఆశ్రయించారు. తన ఫొటోలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారన్నారు.
మార్ఫింగ్ చేయడమే కాకుండా...
తమ ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇబ్బంది కరమైన కామెంట్లు పెడుతున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్ లింక్స్ తో పాటు, వెబ్ సైట్ వివరాలను కూడా పోలీసులకు పవిత్ర అందించారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పవిత్ర ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story