Wed Jan 08 2025 06:44:08 GMT+0000 (Coordinated Universal Time)
కన్నీళ్లు పెట్టుకున్న సమంత
ఈరోజు శక్తి తెచ్చుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యానని సినీ నటి సమంత అన్నారు. ఆమె శాకుంతం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యారు
తాను ఈరోజు శక్తి తెచ్చుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యానని సినీ నటి సమంత అన్నారు. ఆమె శాకుంతం సినిమా ట్రైలర్ రిలీజ్ లో భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ప్రేమ దొరుకుతుందని తాను అనుకోలేదన్నారు. కేవలం గుణశేఖర్ పై ఉన్న గౌరవంతోనే ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. కొందరికి వాళ్ల జీవితంలో సినిమా ఒక భాగమని, కానీ గుణశేఖర్ కు సినిమాయే జీవితమని, శాకుంతలం కూడా మనసు పెట్టి తీశారన్నారు.
ఎన్ని బాధలు అనుభవించినా...
తాను జీవితంలో ఎన్నో కష్టాలను చూశానని, చూస్తున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను జీవితం ఎన్ని బాధలు భరించినా సినిమాల మీద ప్రేమను వదులుకోలేనని సమంత చెప్పారు. శాకుంతలం సినిమా తర్వాత తనపై ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నానని, కోరుకుంటున్నానని సమంత భావోద్వేగానికి గురయ్యారు. డబ్బింగ్ కూడా తానే ఈ సినిమాకు పూర్తి చేశానని సమంత తెలిపారు.
Next Story