Mon Dec 23 2024 15:19:10 GMT+0000 (Coordinated Universal Time)
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యువ ఫిల్మ్ క్రిటిక్ ఆకస్మిక మృతి
కౌశిక్ తన వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా ద్వారా కొత్త సినిమాల బాక్సాఫీస్ రిపోర్టులు, సినిమా అప్ డేట్ లను అందిస్తుంటారు. కౌశిక్ ఇక లేరన్న
సినీ పరిశ్రమలో మరోవిషాద ఘటన చోటుచేసుకుంది. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ఎం(36) గత రాత్రి హఠాన్మరణం చెందారు. అతి పిన్నవయసులో కౌశిక్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం కోలీవుడ్ ను తీవ్రవిషాదంలో ముంచింది. కౌశిక్ మృతిపట్ల తోటి క్రిటిక్స్, చిత్రప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కౌశిక్ తన వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతా ద్వారా కొత్త సినిమాల బాక్సాఫీస్ రిపోర్టులు, సినిమా అప్ డేట్ లను అందిస్తుంటారు. కౌశిక్ ఇక లేరన్న వార్త అతని ట్విట్టర్ ఫాలోవర్లను షాక్ కు గురి చేసింది.
ఇటీవల విడుదలైన సీతారామం సినిమాకు సంబంధించి నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు. కాగా.. కౌశిక్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ ట్రాకర్, ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ వీడియో జాకీ, ఫిల్మ్ రివ్యూయర్, క్రికెట్ & టెన్నిస్ బఫ్ గా గుర్తింపు పొందారు. కౌశిక్ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూలు చేసేవాడు. కౌశిక్ మరణాన్ని గలాట్టా యూట్యూబ్ ఛానెల్ అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ట్వీట్ చేసింది. "ప్రఖ్యాత సినీ విమర్శకుడు, మూవీ ట్రాకర్ మరియు గలాట్టా VJ @LMKMovieManiac గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన మరణం మాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ట్వీట్ లో పేర్కొంది.
Next Story