Fri Nov 22 2024 18:42:35 GMT+0000 (Coordinated Universal Time)
#RRRWinsOscarr : ఆర్ఆర్ఆర్ ను అవమానించిన వారికి ఇది చెంపపెట్టు
ఆర్ఆర్ఆర్ ను నిర్మించింది డీవీవీ దానయ్యే అయినా.. ఆయన ఆస్కార్ ప్రమోషన్ల విషయంలో పక్కకి తప్పుకున్నారు. దాంతో బాహుబలి..
ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేశారు. బాహుబలి సిరీస్ ని మించి ఆర్ఆర్ఆర్.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని వారాలుగా ఎక్కుడచూసిన ఆర్ఆర్ఆర్ పేరు మారుమోగిపోయింది. అందుకు కారణం ఆ సినిమా ఆస్కార్ నామినేషన్లకు ఎంపిక కావడమే. అయితే.. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అంత ఈజీగా వచ్చేయలేదు. గతేడాది మార్చిలో విడుదలై.. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఆస్కార్ నామినేషన్లకు కూడా భారత ప్రభుత్వం తరపున షార్ట్ లిస్ట్ అవుతుందని అంతా ఎదురుచూశారు.
కానీ..ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ మెంబర్స్ ఆర్ఆర్ఆర్ కు మొండిచేయి చూపించారు. ఒక్క కేటగిరీలో కూడా ఆర్ఆర్ఆర్ ను నామినేట్ చేయలేదు. ఆర్ఆర్ఆర్ ను కాదని గుజరాతీ చిత్రం చెల్లో షో ను షార్ట్ లిస్ట్ చేశారు. ఆ చిత్రాన్ని ఎంపిక చేయడం వెనుక పొలిటికల్ రీజన్ ఉందని టాక్. కానీ ఆ సినిమా ఆస్కార్ నామినేషన్లలో ఎంట్రీ సాధించలేకపోయింది. ఇక భారత ప్రభుత్వం తరపున ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ కాలేకపోయామని రాజమౌళి తొలుత నిరాశ చెందినా.. ఆ తర్వాత మరో దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆర్ఆర్ఆర్ ను నిర్మించింది డీవీవీ దానయ్యే అయినా.. ఆయన ఆస్కార్ ప్రమోషన్ల విషయంలో పక్కకి తప్పుకున్నారు. దాంతో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సహాయంతో ఫారెన్ ఎంట్రీ నుంచి ప్రయత్నం మొదలుపెట్టారు. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, గోల్డెన్ టొమాటో ఇలా 20కి పైగా అంతర్జాతీయ అవార్డులందుకున్న ఆర్ఆర్ఆర్.. ఎట్టకేలకు ఆస్కార్ నామినేషన్లకు ఎంట్రీ ఇచ్చింది. ఎంతోకొంత డబ్బులిస్తే ఈ అవార్డు ఇచ్చేయరు. 900 మంది అకాడమీ సభ్యులు కలిసి ఏ సినిమాకైతే ఓటు వేస్తారో.. మెజారిటీ వచ్చిన సినిమాలు విజేతలుగా నిలుస్తాయి. అలా మన ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. భారతీయుల .. ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఆస్కార్ అకాడమీ నాటు నాటు పాటకు అగ్రతాంబూలం ఇవ్వడంతో.. తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది.
Next Story