Fri Nov 22 2024 22:57:57 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా నుంచి ఆస్కార్కు '2018' మూవీ ఎంపిక..
ఈ ఏడాది ఆస్కార్ సమయం వచ్చింది. ఇక భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ఆస్కార్కి..
గత ఏడాది భారత చిత్రాలు ఆస్కార్ (Oscar) పురస్కారంలో సత్తా చాటాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో RRR 'నాటు నాటు' సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' మూవీ ఆస్కార్ ని అందుకొని చరిత్ర సృష్టించాయి. దీంతో ఇండియన్ మేకర్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. అకాడమీ అవార్డులకు తమ సినిమాలను కూడా పంపించాలనే ధ్యేయంతో చిత్రాలు తెరకెక్కించడం మొదలు పెట్టారు.
కొంతకాలంగా పలువురు దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఆస్కార్ కి పంపిస్తామంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆస్కార్ సమయం వచ్చింది. ఈ అవార్డుల ఎలిజిబుల్ లిస్ట్ లో స్థానం దక్కడం కూడా ఎంతో గౌరవంగా భావిస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ టెక్నీషియన్స్. కాగా ఈ అవార్డుల కోసం ప్రతి దేశం అఫీషియల్ గా ఒక మూవీని దేశం తరుపున ఆస్కార్ కి పంపిస్తుంది.
ఈక్రమంలోనే ఈ ఏడాది భారత ప్రభుత్వం.. మలయాళ సూపర్ హిట్ మూవీ '2018'ని ఆస్కార్ కి అధికారికంగా పంపించేందుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా తాజాగా తెలియజేసింది. ఇక ఈ సెలక్షన్ తో మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఏడాది భారత ప్రభుత్వం RRR ని అధికారికంగా ఆస్కార్ కి పంపించలేదు. దీంతో మూవీ టీం అన్-అఫీషియల్ గా ఆస్కార్ కి ఎంట్రీ సాధించి అవార్డుని సొంతం చేసుకున్నారు.
మరి ఈ ఏడాది కూడా 'ఆర్ఆర్ఆర్'లా ఇతర సినిమాలు అన్-అఫీషియల్ గా ఏమన్నా ఆస్కార్ కి వెళ్తాయా..? అనేది చూడాలి. కాగా 2018 సినిమా.. కేరళలో 2018 సంవత్సరంలో వచ్చిన వరదల నేపథ్యంతో తెరకెక్కింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా నెదర్లాండ్స్ లో నిర్వహించే అంతర్జాతీయ అవార్డుల పురస్కారం సెప్టిమిస్ అవార్డుల్లో.. ఈ మూవీకి గాను టోవినో థామస్ 'బెస్ట్ ఆసియన్ యాక్టర్' అవార్డుని అందుకున్నాడు.
Next Story