Mon Dec 23 2024 11:42:48 GMT+0000 (Coordinated Universal Time)
యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు !
రాణి గారి బంగ్లా సినిమా చేసేటప్పుడు రష్మీ నాతో చాలా దురుసుగా వ్యవహరించింది. సినిమా సగం షూటింగ్ అయిపోయాక..
హైదరాబాద్ : బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ తెలియని వారుండరు. జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రష్మీ.. ఇటు యాంకరింగ్ తో, అటు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. సుధీర్ తో లవ్ అంటూ మరింత పాపులర్ అయిన రష్మీ.. తాజాగా చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. కాగా.. రష్మీపై ఓ నిర్మాత చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రష్మీతో రాణిగారి బంగ్లా సినిమా తీసిన నిర్మాత నాగలింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్ రికార్డు ఇంకా తన వద్ద ఉందని చెప్పుకొచ్చాడు.
"రాణి గారి బంగ్లా సినిమా చేసేటప్పుడు రష్మీ నాతో చాలా దురుసుగా వ్యవహరించింది. సినిమా సగం షూటింగ్ అయిపోయాక ఒక సాంగ్ చేయాల్సి వచ్చింది. అందులో తాను నటించలేనని, హీరోను మార్చమని గొడవకు దిగింది. సినిమా సగం షూటింగ్ అయ్యాక హీరోను ఎలా మారుస్తామని నచ్చజెప్పినా వినలేదు. పైగా షూటింగ్ క్యాన్సిల్.. నేను రాను అంటూ బెట్టుచేసింది. అంతేకాకుండా.. నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు అంటూ బెదిరించింది. దీంతో నేను కూడా అదే విషయం చెప్పాను. ఇండస్ట్రీలో ఇనాళ్ళుగా ఉంటున్నాను. నీకే కాదు.. నాక్కూడా అందరూ తెలుసు. షూటింగ్ మధ్యలో ఆపేస్తే నీపై లీగల్ గా కేసు పెడతా. ఫిల్మ్ నగర్ గేటుకు కట్టేసి కొడతానని చెప్పడంతో రష్మీ దిగివచ్చి మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేసింది." అని నిర్మాత నాగలింగం చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. వయసులో తనకన్నా చిన్నదైన రష్మీ.. కనీస గౌరవం లేకుండా మాట్లాడిందట. తాను కూడా రష్మీతో దురుసుగా మాట్లాడానని చెప్పిన నిర్మాత.. అలా మాట్లాడటంలో న్యాయం ఉందని సమర్థించుకున్నారు. అంతా అయిపోయాక.. రష్మీ మంచి నటి అని, రాణిగారి బంగ్లా సినిమా తీసేటపుడు ఏ సీన్ కూ ఎక్స్ ట్రా టేక్ తీసుకోలేదని కితాబిచ్చాడు. కాగా.. ప్రొడ్యూసర్ నాగలింగం రష్మీ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Next Story