Mon Dec 23 2024 16:10:47 GMT+0000 (Coordinated Universal Time)
బలిసికొట్టుకుంటుంది మీరే... ప్రసన్న కు కౌంటర్
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బలిసి కొట్టుకుంటుంది తాము కాదని మీరేనని గట్టిగా జవాబిచ్చారు. ఇటీవల ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా వాళ్లు బలసికొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏంటో కోవూరులో ఎవరిని అడిగినా చెబుతారని, ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే అందరికీ గౌరవమని ఆయన అన్నారు.
నోరు అదుపులో పెట్టుకోవాలని....
మీడియా ముందు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎన్వీ ప్రసాద్ సూచించారు. వంద అడుగుల పైపు నుంచి రోప్ కట్టుకుని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో అర్థమవుతుందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకసారి షూటింగ్ కు వచ్చి చూస్తే తమ కష్టం అంటే ఏందో తెలుస్తుందని ఆయన అన్నారు.
Next Story