Mon Dec 23 2024 02:53:20 GMT+0000 (Coordinated Universal Time)
పది కోట్లు దావా వేసిన మోహన్ బాబు
సినీ నటుడు మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను ట్రోల్ చేసిన వారిపై దావా వేశారు
సినీ నటుడు మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను ట్రోల్ చేసిన వారిపై దావా వేశారు. ఆయన పదికోట్ల మేరకు దావా వేసినట్లు తెలిసింది. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఇటీవల కొందరు ట్రోలింగ్ చేశారు. తమ మనసును గాయపర్చేలా ట్రోల్స్ ఉన్నాయని మోహన్ బాబు బహిరంగంగానే చెప్పారు. దీని వెనక ఎవరున్నారో తనకు తెలుసునని కూడా మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
లీగల్ నోటీసులు....
అయితే మీమ్ పేజీల అడ్మిన్ల కు ఆయన లీగల్ నోటీసులు పంపారు. మీమ్స్ అంటే నవ్వించే ఉండాలి తప్ప, అసభ్యకరంగా ఉండకూడదని ఆయన చెప్పారు. అందుకే మోహన్ బాబు మొత్తం పది కోట్ల మేరకు దావా వేసినట్లు చెబుతున్నారు. లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా మోహన్ బాబు ట్రోలింగ్ కు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- mohan babu
- actor
Next Story