Fri Dec 20 2024 01:21:50 GMT+0000 (Coordinated Universal Time)
వెల్లంపల్లి, కొడాలి నానితో సినిమాలు తీయండి.. వైసీపీకి నాగబాబు కౌంటర్
వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులకు చిత్ర పరిశ్రమ పట్ల అవగాహన లేదని సినీ నటుడు నాగబాబు అన్నారు
వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులకు చిత్ర పరిశ్రమ పట్ల అవగాహన లేదని సినీ నటుడు నాగబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ పట్ల సంకుచిత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తెలిసిన తర్వాతనే ఏపీ ప్రభుత్వం మూవీ టిక్కెట్ల ధరల పెంపు జీవోను విడుదల చేయలేదని నాగబాబు ఫైర్ అయ్యారు. తమ అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే ధైర్యం ఉందా? అని నాగబాబు పరోక్షంగా వైసీపీ మంత్రులకు సవాల్ విసిరారు. ఈ రెండేళ్లైనా మంచి పాలన చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
పవన్ అణగదొక్కేందుకే....
ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని నాగబాబు అన్నారు. సినీ పరిశ్రమపై మంత్రులకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దీనివల్ల సినీ పరిశ్రమ నష్టపోతుందని నాగబాబు ఆందోళన వ్యక్తం చేశారు. హీరోల రెమ్యునరేషన్ సినిమా ఖర్చులోకి రాదా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. హీరోలందరూ తమ సినిమా ఆడకపోతే నిర్మాతలకు ఊరట కలిగిస్తూ రెమ్యునరేషన్ తగ్గించుకున్నవారేనని తెలిపారు. వ్యక్తిగత అజెండాలతో పవన్ ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు.
ఈ వ్యాపారం కూడా మీరే చేయండి...
ఏపీలో ఏ వ్యాపారాన్నైనా వైసీపీ నేతలే తీసుకుంటున్నారని, ఇక చిత్ర పరిశ్రమను కూడా ఏపీలో మీరే తీసుకోండని నాగబాబు అన్నారు. వెల్లంపల్లి, కొడాలి నాని వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు తీసుకొమ్మని సైటైర్ వేశారు. జీవో ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం పెద్దలు సమాధానం చెప్పాలని నాగబాబు నిలదీశారు. ఇకనైనా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేయాలని కోరారు.
Next Story