Mon Dec 23 2024 13:32:14 GMT+0000 (Coordinated Universal Time)
Naresh : ఆ వసూళ్లతో నాకేం సంబంధం?
రమ్య వసూళ్లతో తనకు సంబంధం లేదని సినీ నటుడు నరేష్ తెలిపారు. రమ్య తాను విడిపోయి ఐదేళ్లయిందని చెప్పారు
రమ్య వసూళ్లతో తనకు సంబంధం లేదని సినీ నటుడు నరేష్ తెలిపారు. రమ్య తాను విడిపోయి ఐదేళ్లయిందని చెప్పారు. తాను, రమ్య విడిపోయి చాలా కాలమయిందని, ఆమె ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని చెప్పారు. రమ్య, తాను ఒకే క్యాంపస్ లోనే ఉంటున్నా, విడిగా ఉంటున్నామని చెప్పారు. తాను ఇటీవలే రమ్య ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని పత్రికల ద్వారా నోటీసులు ఇచ్చానని నరేష్ చెప్పారు.
తాను గతంలోనే....
రమ్య వసూళ్లపై ఇప్పటికే చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. గత రెండు మూడు రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రమ్య ఇంటికి కొన్ని రోజుల నుంచి కార్లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని, ఇది చూసి ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆందోళన చెందారన్నారు. రమ్యకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని గతంలోనే స్నేహితులకు, బంధువులకు చెప్పానని నరేష్ తెలిపారు. ఆమె ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ మరోసారి స్పష్టం చేశారు.
Next Story