Sun Dec 22 2024 22:18:42 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే !
ఈ నెల 10వ తేదీన వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
అటు వెబ్ సిరీస్ లు.. ఇటు సినిమాలతో ఈ వారం ఓటీటీల్లో కాస్త సందడి ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అనిక సురేంద్రన్ నటించిన బుట్టబొమ్మ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ నెల 10వ తేదీన వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కోసం అంతా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు.
మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో యాంగర్ టేల్స్ సినిమా స్ట్రీమింగ్ అవనుంది. ఈ సిరీస్ లో సుహాస్, బిందుమాధవి, మడోన్నా సెబాస్టియన్ ప్రధానమైన పాత్రలను పోషించగా.. సుహాస్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించాడు. నటుడిగా సక్సెస్ అయిన సుహాస్.. నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.
ఇక పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'సత్తిగాని రెండెకరాలు'. ఈ సినిమా మార్చి 17 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అదే రోజున.. సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' Zee 5లో స్ట్రీమింగ్ కు రానుంది. సుహాస్ - టీనా శిల్పరాజ్ జంటగా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లోనే ఏప్రిల్ 1న అమిగోస్ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.
Next Story