Fri Jan 10 2025 06:13:43 GMT+0000 (Coordinated Universal Time)
బెల్లంకొండకు సారీ చెప్పిన ఫైనాన్షియర్
బెల్లంకొండ సురేష్ పై సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును కూడా ఆయన వెనక్కి తీసుకున్నారు. బెల్లంకొండ మేనేజర్లు..
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు, హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఫైనాన్షియర్ శరణ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. అలాగే బెల్లంకొండ సురేష్ పై సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును కూడా ఆయన వెనక్కి తీసుకున్నారు. బెల్లంకొండ మేనేజర్లు, తన అకౌంట్స్ సిబ్బంది మధ్య నెలకొన్న సమాచార లోపం కారణంగానే తాను వారిపై కేసు పెట్టానని శరణ్ కుమార్ చెప్పారు.
కాగా.. ఓ చిత్ర నిర్మాణం కోసం తన వద్ద బెల్లంకొండ సురేష్ రూ.85 లక్షలు తీసుకున్నారని, తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫైనాన్షియర్ శరణ్ కుమార్ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచన మేరకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్.. ఇదంతా అబద్ధమంటూ మీడియాకు తెలిపారు. తాజాగా శరణ్ కుమార్ కేసు వాపసు తీసుకోవడంతో.. ఈ వివాదం ముగిసింది.
Next Story