Sat Dec 21 2024 06:08:53 GMT+0000 (Coordinated Universal Time)
సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు.. నాకేం తెలీదంటున్న రాహుల్ ?
సింగర్ రాహుల్ జైన్ తన పనితనాన్ని మెచ్చుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడని, తనను పర్సనల్ స్టైలిస్ట్ గా..
ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ రాహుల్ జైన్ పై ముంబై లో అత్యాచారం కేసు నమోదైంది. కాస్ట్యూమ్ స్టైలిస్ట్ గా పనిచేసే 30 ఏళ్ల మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. మహిళ ఆరోపణలతో ముంబై పోలీసులు రాహుల్ పై అత్యాచారం కింద కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
సింగర్ రాహుల్ జైన్ తన పనితనాన్ని మెచ్చుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడని, తనను పర్సనల్ స్టైలిస్ట్ గా నియమించుకుంటానని చెప్పి ఓసారి కలవాలని చెప్పాడని మహిళ పోలీసులకు తెలిపింది. అతడిని కలిసేందుకు అతని ఫ్లాట్ కి వెళ్లగా.. తనపై అత్యాచారయత్నం చేశాడని పేర్కొంది. తాను ప్రతిఘటించగా.. రాహుల్ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని, తన మొబైల్ లాక్కొని ఇన్ స్టాగ్రామ్ లో రాహుల్ చేసిన మెసేజ్ లు, ఫోన్ కాల్స్ అన్నింటినీ డిలీట్ చేశాడని పోలీసులకు తెలిపింది.
మహిళ తెలిపిన వివరాలతో ముంబై పోలీసులు రాహుల్ జైన్ పై సెక్షన్ 376,323 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయం మీడియా దృష్టికి రాగా.. సింగర్ రాహుల్ ఆ వార్తలను ఖండించారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఇంతకుముందెన్నడు ఆమెను చూడలేదని చెప్తున్నాడు. కానీ.. నెటిజన్లు మాత్రం రాహుల్ ను తిట్టిపోస్తున్నారు.
Next Story