Thu Dec 19 2024 16:48:29 GMT+0000 (Coordinated Universal Time)
Where is Pushpa : పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్.. బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది
తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అంటూ గ్లింప్స్ మొదలవుతుంది. శేషాచలం అడవుల్లో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప - ది రూల్. రెండ్రోజుల క్రితం ఈ సినిమా నుంచి Where is Pushpa అంటూ విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక అల్లుఅర్జున్ బర్త్ డే సందర్భంగా శుక్రవారం సాయంత్రం పుష్ప-2 మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. 3 నిమిషాల 18 సెకండ్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ లో పుష్ప కోసం పోలీసులు, మీడియా, పుష్ప ఫ్యాన్స్ వెతుకుతున్నట్లు చూపించారు. గ్లింప్స్ చివరిలో పుష్పకి పులి భయపడుద్ది అంటూ చూపించిన తీరు గ్లింప్స్ కే హైలెట్ గా నిలిచింది.
తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అంటూ గ్లింప్స్ మొదలవుతుంది. శేషాచలం అడవుల్లో పుష్ప జాడకోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తుంటాయి. మధ్యలో పుష్ప దుస్తులు రక్తపు మరకలతో కనిపించడంతో పుష్ప చనిపోయాడన్న వదంతులు వ్యాపించడంతో అల్లర్లు జరుగుతాయి. దీనిపై మీడియాలో డిబేట్ లు కూడా నిర్వహిస్తారు. పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు, అల్లర్లు చేస్తారు. పుష్ప బ్రతికే ఉన్నాడనేది ప్రజల నమ్మకం. పుష్ప జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ.. తమకు చాలా మంచి చేశాడని ఆయన దేవుడని చెప్తుంటారు.
మరి పుష్ప ఏమయ్యాడు. దేశం వదిలి పారిపోయాడా ? లేక చనిపోయాడా? అన్న సందిగ్ధంలో ప్రజలు ఉండగా.. ఓ లోకల్ రిపోర్టర్ తెచ్చిన వీడియోలో పుష్ప కనిపిస్తాడు. ఆ వీడియోలో పుష్పను చూసి పులి రెండడుగులు వెనక్కి వేస్తుందని చూపించడంతో.. పుష్ప బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఈ గ్లింప్స్ లో అల్లు అర్జున్ ని తప్ప.. మరే ఇతర ముఖ్య పాత్రలను మేకర్స్ చూపించలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పుష్ప -1 కి తగ్గట్టే ఉంది. బన్నీ బర్త్ డే కి పుష్ప 2 టీమ్ ఇచ్చిన గిఫ్ట్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక తగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బన్నీ అని కామెంట్లు పెడుతున్నారు.
Next Story