Mon Dec 23 2024 19:10:28 GMT+0000 (Coordinated Universal Time)
రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ అప్పుడే !
ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ లు నటిస్తున్నారు. సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో..
హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఖిలాడి విడుదలవ్వగా.. నెక్స్ట్ రామారావు ఆన్ డ్యూటీని లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ లు నటిస్తున్నారు. సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట 'బుల్ బుల్ తరంగ్'ని ఏప్రిల్ 10న చిత్ర బృందం విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ పాటను రవితేజ, రజిషాలపై చిత్రీకరించగా.. వారిద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుందంటున్నారు. ఫారిన్ డ్యాన్సర్ల తో స్పెయిన్లో ఈ పాటని చాలా లావిష్ గా చిత్రీకరించారు. జూన్ 17వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ థియేటర్లలో విడుదల కానుంది.
Next Story