Mon Dec 23 2024 18:08:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. వింటే గూస్ బంప్స్ ఖాయం
విడుదలకు ఇంకా రెండు నెలలే ఉండటంతో.. ఇప్పుడిప్పుడే ఆదిపురుష్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. భారీ బడ్జెట్ తో రామాయణ ఇతిహాసం ఆధారంగా తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పటికే 3డి వెర్షన్ లో టీజర్ ను రిలీజ్ చేయగా.. అది ప్రభాస్ ఫ్యాన్స్ తో సహా అందరినీ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దాంతో దర్శకుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. మేకర్స్ వీఎఫ్ఎక్స్ ను మార్చే పనిలో పడ్డారు. విడుదలకు ఇంకా రెండు నెలలే ఉండటంతో.. ఇప్పుడిప్పుడే ఆదిపురుష్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఆదిపురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని ఇప్పటికే ప్రచారం జరగ్గా.. ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను వదిలి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ఈ సాంగ్ తెలుగు, హిందీ వెర్షన్లలో చిన్న లిరికల్ బిట్ ను వదిలారు. “నీ సాయం.. సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్య.. మా బలమేదంటే నీపై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే.. మహిమాన్విత మంత్రం నీ నామం.. జైశ్రీరాం.. జైశ్రీరాం..” అంటూ సాగే ఈ పాట వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. అజయ్-అతుల్ సంగీతం అందించారు.
Next Story