Mon Dec 23 2024 03:42:27 GMT+0000 (Coordinated Universal Time)
ధమాకా నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో
ఇక ధమాకాలో రవితేజ సరసన "పెళ్లిసందడి" ఫేమ్ శ్రీలీల నటిస్తోంది. తాజాగా ధమాకా నుంచి ప్లే లిరికల్ సాంగ్ ను విడుదల..
మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలను విడుదల చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు విడుదలవ్వగా.. ఆ రెండు సినిమాలూ ఫ్యాన్స్ ను నిరాశ పరిచాయి. ఈ ఏడాది రాబోతోన్న మూడో సినిమా ధమాకా. ఈ సినిమాకు మాస్ సినిమాల స్పెషలిస్ట్ త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ధమాకా ఖచ్చితంగా మాస్ సినిమానే అవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.
ఇక ధమాకాలో రవితేజ సరసన "పెళ్లిసందడి" ఫేమ్ శ్రీలీల నటిస్తోంది. తాజాగా ధమాకా నుంచి ప్లే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. "నిన్ను సూడబుద్దయితుంది రాజీగో .. మాట్లాడబుద్దయితుంది రాజీగో" అంటూ జానపద బాణీలో ఈ పాట సాగుతోంది. బీమ్స్ సంగీతాన్ని అందించగా కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చాడు. బీమ్స్ - మంగ్లీ కలిసి పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేయించారు. త్వరలోనే ధమాకా విడుదల తేదీని ప్రకటించనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజకు ధమాకా మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి.
Next Story