Sun Dec 22 2024 05:22:28 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్.. ఆరుపదుల వయసులోనూ అదరగొట్టిన చిరంజీవి
ఊర మాస్ గెటప్ లో లుంగీ-అంగీ లో కనిపించిన చిరంజీవిని చూసి అభిమానులు.. వింటేజ్ చిరుని చూసినట్లుందంటున్నారు. ఆరుపదుల..
వాల్తేరు వీరయ్య. చిరంజీవికి ఇది 154వ సినిమా. ఈ ఏడాదిలో ముందుగా వచ్చిన ఆచార్య.. బాక్సాఫీస్ వద్ద డీలా పడినా.. గాడ్ ఫాదర్ ఆ గాయాన్ని చెరిపేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వాల్తేరు వీరయ్య వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా నుండి "బాస్ పార్టీ" ఊర మాస్ సాంగ్ లిరికల్ వీడియోనూ విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా ఈ పాటలో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది.
ఊర మాస్ గెటప్ లో లుంగీ-అంగీ లో కనిపించిన చిరంజీవిని చూసి అభిమానులు.. వింటేజ్ చిరుని చూసినట్లుందంటున్నారు. ఆరుపదుల వయసు దాటినా.. సినిమా, డ్యాన్సు పట్ల ఆయనకున్న కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంక్రాంతికి మైత్రీ మూవీస్ తనతో తానే పోటీ పడనుంది. బాలయ్య.. వీర సింహారెడ్డిని కూడా ఈ బ్యానరే నిర్మిస్తుంది. ఇద్దరు హీరోల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగనున్నాయి. మరి మైత్రీ మూవీస్ డబుల్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
Next Story