Sun Dec 22 2024 21:56:28 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ బర్త్ డే గిఫ్ట్.. ఖుషీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల
నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే కానుకగా ఖుషీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్..
విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఖుషీ. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే కానుకగా ఖుషీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ పాటను విడుదల చేశారు.
నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాటకి దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించాడు. అబ్దుల్ వహాబ్ పాడిన ఈ పాట చిత్రీకరణ అంతా కాశ్మీర్ లోయల్లో తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతిగా ఆరాధ్య అనే పాత్రలో కనిపించనుంది. ఈ పాటలో సమంత - విజయ్ ల మధ్య ఎలాంటి కిస్ సీన్లు లేకుండా చిత్రీకరించడం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. చాలా కాలం తర్వాత మంచి కెమెస్ట్రీతో ఒక మంచి మెలెడీ సాంగ్ ను చూస్తున్నామని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ పాటను బట్టి.. ఖుషి సినిమా కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని భావిస్తున్నారు. గీత గోవిందం ను మించిన సినిమా అవుతుందని ఆశిస్తున్నారు.
Next Story