Sat Dec 21 2024 17:52:19 GMT+0000 (Coordinated Universal Time)
భోళా మ్యానియా ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది
ఇటీవలే స్విట్జర్లాండ్ లో షూటింగ్ ను పూర్తిచేసుకుని హైదరాబాద్ కు చేరుకుంది చిత్రబృందం. సినిమా విడుదలకు..
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రాల్లో భోళాశంకర్ ఒకటి. తమిళ సినిమా వేదాళం రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే స్విట్జర్లాండ్ లో షూటింగ్ ను పూర్తిచేసుకుని హైదరాబాద్ కు చేరుకుంది చిత్రబృందం. సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే స్లో గా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. తాజాగా భోళా మ్యానియా సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. తాజాగా రిలీజైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. ఫుల్ లిరికల్ సాంగ్ ని 4న రిలీజ్ చేయబోతున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన నటిస్తుండగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో కనిపించనుంది. నటుడు సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. స్మగ్లింగ్, గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తో సిస్టర్ సెంటిమెంట్ లో ఈ సినిమా ఉండబోతుంది. ఈ ఏడాది ఆగస్టు 11న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
Next Story