Sun Dec 22 2024 15:59:00 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య నుండి బాస్ పార్టీ సాంగ్ ప్రోమో .. రేపు ఫుల్ సాంగ్
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా వాల్తేరు వీరయ్య నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో ను విడుదల ..
మెగాస్టార్ చిరంజీవి.. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా వాల్తేరు వీరయ్య. ఊరమాస్ సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుండగా.. చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. మళ్లీ వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామన్న భావన కలిగింది అందరికీ.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా వాల్తేరు వీరయ్య నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో ను విడుదల చేశారు. బాస్ పార్టీ గా వస్తున్న ఈ పాటను దేవిశ్రీ, హరిప్రియ ఆలపించారు. పూర్తి లిరికల్ పాటను నవంబర్ 23 వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Next Story