Mon Dec 23 2024 07:55:13 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారువారి పాట నుంచి ఫస్ట్ సాంగ్ పోస్టర్.. 14న పాట విడుదల
సర్కారు వారిపాట నుంచి ఫస్ట్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా
మహేష్ బాబు - కీర్తి సురేశ్ జంటగా.. పరశురామ్ రూపొందించిన సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సింది. అందుకే వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చారు. కానీ.. కొన్ని కారణాల చేత సినిమా విడుదల ఏప్రిల్ 1కి, తాజాగా మే 12వ తేదీకి విడుదల వాయిదా పడింది. మొత్తానికి మే 12వ తేదీని సర్కారువారి పాట బుక్ చేసుకుంది. కానీ.. అప్ డేట్స్ ఇవ్వడంలో చాలా గ్యాప్ రావడంతో.. సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో తాజాగా మరో అప్ డేట్ ను వదిలారు మేకర్స్.
సర్కారు వారిపాట నుంచి ఫస్ట్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కళావతి అంటూ సాగే ఈ పాట పోస్టర్ లో కీర్తి సురేశ్ అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మైత్రీ - 14 రీల్స్ సంస్థలతో పాటు మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.
News Summary - First Song Poster from Sarkaruvari Pata
Next Story