Mon Dec 23 2024 11:27:34 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారువారి పాట నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్
కొద్దిసేపటి క్రితమ్ ఈ ప్రోమో సాంగ్ రిలీజ్ అవ్వగా.. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.
డైరెక్టర్ పరశురామ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా సర్కారువారి పాట. మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ పోస్టర్ విడుదలైంది. తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసి.. మహేష్ ఫ్యాన్స్ కు సర్కారువారి పాట టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమ్ ఈ ప్రోమో సాంగ్ రిలీజ్ అవ్వగా.. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.
ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా.. సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఏమాటకి ఆ మాట.. సిద్ వాయిస్ చాలా మెలోడియస్ గా ఉంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటలో మహేష్ హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన "కళావతి" ఫస్ట్ లిరికల్ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
News Summary - First Song Promo Released from Sarkaruvari Pata
Next Story