Mon Dec 23 2024 15:34:52 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా శెట్టితో సెల్ఫీ కోసం.. కారు లోపలికి వెళ్ళబోయాడు
శిల్పా ఈవెంట్ జరిగిన ప్రాంతం నుండి బయటికి వచ్చి వారి కారు వైపు వెళ్ళింది. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలను తీశారు.
ముంబైలో స్మృతి ఖన్నా కుమార్తె అన్యక రెండవ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన కుమార్తె సమీషాతో కలిసి కనిపించింది. సమీషాతో పాటు శిల్పా ఈవెంట్ జరిగిన ప్రాంతం నుండి బయటికి వచ్చి వారి కారు వైపు వెళ్ళింది. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలను తీశారు. అయితే ఊహించని విధంగా ఒక అభిమాని వారితో సెల్ఫీ తీసుకోవడానికి కారులోకి వెళ్లిపోయేంత పని చేశాడు.
దీంతో శిల్పా శెట్టి ఒక్కసారిగా షాక్ అయింది. "అరే భాయ్ క్యా కర్ రహే హో?"(ఏమి చేస్తున్నావ్) అంటూ అతనిని ఆపడానికి ప్రయత్నించింది. ఆమె సెక్యూరిటీ, ఫోటోగ్రాఫర్లు అతనిని ఆమె కారు నుండి దూరంగా వెళ్ళమని కోరడంతో ఆ అభిమాని వెనక్కి తగ్గాడు.
ఇక బాబా సిద్ధిఖీ రంజాన్ మాసంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీని నిర్వహించడం తెలిసిందే. గత రెండేళ్లుగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా బాబా సిద్ధిఖీ పార్టీని నిర్వహించలేదు. కానీ ఈసారి, కోవిడ్ -19 కేసులు తగ్గినందున, బాబా సిద్ధిఖీ ఇఫ్తార్ పార్టీని ఏప్రిల్ 17, 2022న ఘనంగా నిర్వహించారు. అతను ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఇందుకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ, ఆయుష్ శర్మ, కుబ్రా సైత్, అర్పితా ఖాన్ శర్మ, సయానీ గుప్తా, మికా సింగ్ మరియు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు.
Next Story