Mon Dec 23 2024 03:36:43 GMT+0000 (Coordinated Universal Time)
Kurchi Madathapetti : ఫారినర్స్ ఫిట్నెస్ మంత్రగా మారిన 'కుర్చీ మడత పెట్టి' సాంగ్..
'కుర్చీ మడత పెట్టి' సాంగ్ తో జిమ్లో వర్క్ అవుట్స్ చేస్తున్న ఫారినర్స్.
Kurchi Madathapetti : మహేష్ బాబు నుంచి ఈ సంక్రాంతి ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఇక థమన్ సంగీతం అందించిన ఈ మూవీలోని.. 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ మాస్ ని ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటకి మహేష్ అండ్ శ్రీలీల వేసిన స్టెప్పులు విజుల్స్ వేయించాయి.
మాస్ బీట్తో అందర్నీ ఉత్సాహపరుస్తున్న ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్.. ఫారినర్స్ లో కూడా జోష్ నింపుతుంది. ఇక ఈ జోష్ ని ఫారినర్స్ తమ ఫిట్నెస్ మంత్రగా మార్చుకుంటున్నారు. జిమ్ లో భారీ కసరత్తులు చేయకుండా, ఈ పాట పెట్టుకొని వార్మ్ అప్ వర్క్ అవుట్స్ చేస్తూ.. ఫిట్నెస్ ప్లాన్ చేస్తున్నారు. జిమ్ లో ఈ పాటకి వర్క్ అవుట్స్ చేస్తున్న ఫారినర్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని మహేష్ బాబు కూడా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. దాని వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
కాగా మొన్నటివరకు థియేటర్స్ లో సందడి చేసిన 'గుంటూరు కారం' మూవీ.. ఇప్పుడు ఓటీటీ సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.
Next Story