Mon Dec 15 2025 00:26:46 GMT+0000 (Coordinated Universal Time)
Jayapradha Case:లొంగిపోయిన జయప్రద
సీనియర్ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో

Jayapradha Case:సీనియర్ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయినా ఆమె ఆమె స్పందించలేదు. ఫిబ్రవరి 27న ఆమెకు సీఆర్పీసీ 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్ ను రాంపూర్ లోని ఎంపీ / ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది. వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. జయప్రద పరారీలో ఉన్నట్టు కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయప్రద కోర్టులో లొంగిపోయారు.
రాజకీయాలు, సినిమాలు రెండింటిలోనూ పేరుగాంచిన నటి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నారు. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై జయప్రదపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆమె కోర్టులో లొంగిపోయారు. ఈ పరిణామాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Next Story

