Sun Dec 22 2024 15:15:40 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం ఓటీటీలకు క్యూ కట్టిన సంక్రాంతి సినిమాలు
ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో పెద్ద సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన ..
ప్రతి వారం ఓటీటీలలో చిన్న, పెద్ద సినిమాలు విడుదలవుతూ.. ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో పెద్ద సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలకు క్యూ కట్టాయి. వాటిలో మొదటిది వరిసు తెలుగులో వారసుడు. సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో జనవరి 11న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాలో విజయ్, రష్మిక మందన్నలు నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. రేపటి (ఫిబ్రవరి 22) నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి. శృతిహాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ లతో పాటు తదితరులు నటించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదలై.. మంచి వసూళ్లు రాబట్టింది. కథ, పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో.. అవలీలగా రూ.100 కోట్లు వసూలు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి.. ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. శృతిహాసన్ హీరోయిన్ గా వచ్చిన మరోసినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు బాబీ వింటేజ్ చిరు లుక్ లో చూపించడం.. చిరంజీవి మార్క్ కామెడీ, పాటలు, కథ, సెంటిమెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. జనవరి 13న థియేటర్స్ కి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కాబోతోంది.
సందీప్ కిషన్ హీరోగా.. రంజిత్ జయకోడి రూపొందించిన మైఖేల్ ఈ నెల 3వ తేదీన థియేటర్లలో విడుదలైంది. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించిన మైఖేల్ కు.. ఆశించిన స్థాయిలో థియేటర్లలో రెస్పాన్స్ రాలేదు. ఈ నెల 24వ తేదీ నుంచి మైఖేల్ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ ఉంటుందో చూడాలి.
Next Story