Tue Dec 24 2024 00:20:18 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ లిరికల్ వీడియో.. నిమిషాల్లోనే లక్షల వ్యూస్
భీమ్లా నాయక్ నుంచి 4వ పాటను విడుదల చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా మల్టీ స్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లానాయక్. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలుశ్రోతలను అలరిస్తున్నాయి. తాజాగా భీమ్లా నాయక్ నుంచి 4వ పాటను విడుదల చేశారు. శనివారం ఉదయం యూట్యూబ్ వేదికగా ఆదిత్య మ్యూజిక్ వారు భీమ్లా నాయక్ సినిమాలో నుంచి 4వ పాట అయిన "అడవితల్లి మాట" లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు కూడా మన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు.
నిమిషాల్లోనే ....
ఇక "అడవితల్లి మాట" పాట విషయానికొస్తే.. ఈ పాటలోని ప్రతి లైన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే లక్షల వ్యూస్ వచ్చాయంటే.. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. భీమ్లా నాయక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివికమ్ డైలాగ్స్ అందించారు. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా కు జోడీగా మలయాళ నటి సంయుక్త మీనన్ నటించారు. వీరితో పాటు ప్రముఖ నటులు రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాతికి ఈ సినిమా థియేటర్లలో విడుదలైన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.
Next Story