మొదటి రోజు దుమ్ము దులిపింది
విడుదలకు ఒక్క రోజు ముందు పేరు మార్చుకున్న వాల్మీకి సినిమా గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్మీకి టైటిల్ మీదున్న హైప్ గద్దలకొండ గణేష్ [more]
విడుదలకు ఒక్క రోజు ముందు పేరు మార్చుకున్న వాల్మీకి సినిమా గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్మీకి టైటిల్ మీదున్న హైప్ గద్దలకొండ గణేష్ [more]
విడుదలకు ఒక్క రోజు ముందు పేరు మార్చుకున్న వాల్మీకి సినిమా గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్మీకి టైటిల్ మీదున్న హైప్ గద్దలకొండ గణేష్ మీద లేదు. చిత్ర బృందం అంతా ఓ నైట్ నిద్రలేకుండా గడిపింది. గద్దలకొండ గణేష్ టైటిల్ రీచ్ అవుతుందా.. లేదా.. అని. కానీ గద్దలకొండ గణేష్ టైటిల్ తో వరుణ్ తేజ్ మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు రూ. 5.67 కోట్ల షేర్ రాబట్టి వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ అనిపించాడు. మాస్ పాత్రలో గద్దలకొండ గణేష్ గా వరుణ్ ఫర్ ఫామెన్స్ , లుక్ అన్నింటికి మెగా ఫాన్స్ ముగ్దులవుతున్నారు. ఇక కథ, కథనంలో బలం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం అన్ని సినిమాకి కలిసి రావడంతో సినిమాకి మిక్స్డ్ టాక్ పడింది.
ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 1.65
సీడెడ్ 0.82
నెల్లూరు 0.25
కృష్ణ 0.42
గుంటూరు 0.71
వైజాగ్ 0.70
ఈస్ట్ గోదావరి 0.54
వెస్ట్ గోదావరి 0.58
టోటల్ ఏపీ & టీస్ షేర్ 5.67