Mon Dec 23 2024 10:38:12 GMT+0000 (Coordinated Universal Time)
ఖిలాడి నుంచి "ఫుల్ కిక్కు" మాస్ సాంగ్ విడుదల..
రవితేజ - డింపుల్ హయతిపై షూట్ చేశారు. పక్కా మాస్ బీటే కాదు.. ఫాస్ట్ బీట్ కూడా ఈ పాట. రవితేజ ఎనర్జీ లెవల్స్
రవితేజ హీరోగా.. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఖిలాడి. ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. సత్యనారాయణ కోనేరు నిర్మతగా వ్యవహరించగా.. మ్యూజిక్ మెజీషియన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి మూడు సింగిల్స్ రాగా.. దేనికదే స్పెషల్ సాంగ్ గా నిలిచాయి. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. మరో పాటను విడుదల చేశారు మేకర్స్.
ఫుల్ కిక్కు అంటూ సాగే ఈ పాటను రవితేజ - డింపుల్ హయతిపై షూట్ చేశారు. పక్కా మాస్ బీటే కాదు.. ఫాస్ట్ బీట్ కూడా ఈ పాట. రవితేజ ఎనర్జీ లెవల్స్ ఏ మాత్రం తగ్గకుండా పాడారు సాగర్ - మమత శర్మ. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
News Summary - Full Kikku Song from Khiladi Movie
Next Story