Mon Dec 23 2024 07:09:16 GMT+0000 (Coordinated Universal Time)
విశ్వక్ సేన్ 'గామి'.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'గామి'.. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'గామి'.. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15.10 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. దాదాపుగా బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. గామి సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా రన్ అవుతోంది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ చాలా బాగున్నాయని ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో బ్రేక్ఈవెన్ మార్క్‌ను చేరుకోగా, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్వెన్కు చాలా దగ్గరగా ఉంది. మొదటి రోజు 9.07 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 6.03 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల కలెక్షన్లు 15.10 కోట్లు. ఈ చిత్రం రెండు రోజుల ప్రపంచవ్యాప్తంగా షేర్ 7 కోట్లకు చేరుకుంది. బ్రేక్ ఈవెన్ 10 కోట్ల+ వద్ద ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
మంచి వసూళ్లతో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్కు చేరుకోగా.. మూడో రోజు మిగిలిన ఏరియాల్లోను రీచ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఈ చిత్రం విడుదల అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటి రోజు అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా గామి నిలిచింది.
Next Story