Mon Dec 23 2024 10:58:14 GMT+0000 (Coordinated Universal Time)
Vishwak Sen : సెల్ఫీ కోసం వచ్చిన ఫ్యాన్.. ఫోన్ లాగేసుకున్న విశ్వక్..
సెల్ఫీలు కోసం వచ్చిన ఫ్యాన్ వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్న విశ్వక్ సేన్. వైరల్ అవుతున్న వీడియో..
Vishwak Sen : ఇన్నాళ్లు మాస్ అండ్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. ఈసారి ‘గామి’ వంటి ప్రయోగాత్మక సినిమాతో పలకరించారు. విశ్వక్ ఈ సినిమాలో అఘోర పాత్ర చేయగా చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, ఉమా ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అండ్ టేకింగ్ తో మెప్పించి సూపర్ హిట్టుని అందుకుంది.
ఇక మంచి విజయం అందడంతో మూవీ టీం తిరుమల వెంకన్న దర్శించుకున్నారు. విశ్వక్ సేన్, చాందిని చౌదరి నేడు తిరుమలలో సందడి చేసారు. దర్శనం అనంతరం బయటకి వచ్చిన విస్వం అండ్ చాందినితో సెల్ఫీలు దిగేందుకు అక్కడ ఉన్న ప్రేకక్షులు ఉత్సాహం చూపించారు. ఈక్రమంలోనే ఒక అభిమాని విశ్వక్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. విశ్వక్ ఆ ఫోన్ లాగేసుకున్నారు.
ఆ తరువాత మరోకొంతమంది అభిమానుల ఫోన్స్ ని కూడా అలాగే లాగేసుకున్నారు. తమ ఫోన్ ఇవ్వమని అభిమాని అడుగుతుంటే.. 'బహుమతిగా ఇచ్చాను అనుకో' విశ్వక్ బదులిస్తూ వచ్చారు. కాసేపు అభిమానులను ఆట పట్టించిన విశ్వక్.. చివరికి అందరి ఫోన్స్ తిరిగి ఇచ్చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక గామి కలెక్షన్స్ విషయానికి వస్తే.. రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని సాధించేసింది. ప్రెజెంట్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ 22 కోట్ల మార్క్ ని దాటేసింది. ప్రస్తుతం కొత్త సినిమా రిలీజ్ లు ఏం లేవు. మరి గామి తన ఫైనల్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.
Next Story