Mon Dec 23 2024 10:51:41 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్ర చేయగలడు.. బాలీవుడ్ డైరెక్టర్!
ఇండియాలో ఆ పాత్రకి న్యాయం చేయగల ఒకేఒక్క నటుడు ఎన్టీఆర్ అంటూ బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ చేసిన కామెంట్స్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. RRR చిత్రంతో తన నటనా విశ్వరూపాన్ని బాలీవుడ్ వాళ్ళకి కూడా చూపించాడు. దీంతో అక్కడి మేకర్స్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే వార్ 2 (War 2) సినిమా ఆఫర్ రావడం, దానికి ఎన్టీఆర్ ఒకే చెప్పడం జరిగిపోయేది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తారక్ నటనను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ చేశాడు.
తాజాగా బాలీవుడ్ లో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 (Gadar 2) బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీంతో రీసెంట్ గా బాలీవుడ్ లోని స్టార్స్ అందరికి గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చింది మూవీ టీం. ఈ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు బడా స్టార్స్ కూడా పాల్గొన్నారు. కాగా ఈ మూవీ దర్శకుడు అనిల్ శర్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఆ ఇంటర్వ్యూలో 'సన్నీ డియోల్ పోషించిన పాత్రని ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏ యాక్టర్ పోషించగలడు అని అనుకుంటున్నారు' అని ప్రశ్నించారు. దీనికి అనిల్ శర్మ బదులిస్తూ.. "బాలీవుడ్ లో అయితే ఎవరు లేరు. సౌత్ లో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకి వంద శాతం న్యాయం చేయగలడు" అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడే ఇలా ఉంటే.. వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ ని సంపాదించుకుంటాడో చూడాలి. కాగా ఈ వార్ 2లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కబోతుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు.
Next Story