Sun Dec 22 2024 22:53:10 GMT+0000 (Coordinated Universal Time)
Dil Raju : ఈ పాట పాడింది.. దిల్ రాజు అని మీకు తెలుసా..?
ఆ సినిమాలోని పాటని దిల్ రాజు పడినట్లు మీకు తెలుసా..? అప్పటిలో ఆ పాట కాలేజీ స్టూడెంట్స్ నోటిలో తెగ వినిపించింది.
Dil Raju : టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి.. 'దిల్' మూవీతో నిర్మాతగా మారారు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజు.. ఆ మూవీ టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇక నిర్మాతగా అక్కడ మొదలైన దిల్ రాజు కెరీర్.. నేడు వందల కోట్ల కలెక్షన్స్ అందుకునే సినిమాలు నిర్మిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాదు.. దిల్ రాజు సింగర్ గా సినిమాల్లో పాటలు కూడా పడతారంటా. గతంలో ఓ మూవీలో ఒక పాట పాడగా.. అది ఇప్పుడు వైరల్ గా మారింది. దిల్ రాజు నిర్మాతగా అక్కినేని వారసుడు నాగచైతన్యని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా 'జోష్'. ఈ సినిమాకి సందీప్ చౌత్ సంగీతం అందించారు. స్వతహాగా దిల్ రాజుకి సంగీతం పై మంచి అభిరుచి ఉంది.
తన ప్రతి సినిమాలోని సాంగ్స్ ని లిరిక్స్ తో సహా ఆయనే ఫైనల్ చేస్తారంట. మ్యూజిక్ ఫైనల్ అయిన తరువాత దానిని నిత్యం హమ్ చేస్తూ ఉంటారంటా. పాటలోని టెంపోకి లిరిక్ లోని ఏదైనా పదం సెట్ అవ్వలేదు అనిపిస్తే.. తాను మార్పులు కూడా చేయించుకుంటారంటా. అందుకనే దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాలు అన్నిటి సాంగ్స్ దాదాపు సూపర్ హిట్టుగా ఉంటాయి. లిరిక్స్ కూడా క్యాచీగా ఉంటాయి.
ఇక జోష్ మూవీలోని 'అన్నయ్య వచ్చినాడో.. వెలుగుల వెన్నెల తెచ్చినాడో' అనే సాంగ్ ట్యూన్ ఫైనల్ చేశాకా లిరిక్స్ తో దిల్ రాజు హమ్ చేస్తూ దర్శకుడు వాసువర్మకి కనిపించారు. దిల్ రాజు బాగా పాడడం గమనించిన దర్శకుడు.. ఆ పాటని దిల్ రాజే పాడాలంటూ బలవంతం చేశారు. దీంతో సినిమాలోని పాటను దిల్ రాజు తన గొంతుతో పాడారు. అప్పటిలో ఈ పాట కాలేజీ స్టూడెంట్స్ నోటిలో తెగ వినిపించింది.
Next Story